-- --

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా! అమ్దాపూర్ సొసైటీ చైర్మన్‌గా సూర రవి బాధ్యతల స్వీకరణ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా – చైర్మన్ సూర రవి….

బోధన్: బోధన్ మండలంలోని అమ్దాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన సూర రవి శుక్రవారం సొసైటీ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన చైర్మన్‌కు ఘన స్వాగతం పలికారు.

అనంతరం చైర్మన్ సూర రవితో పాటు సొసైటీ డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూర రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రైతులకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, సొసైటీ ద్వారా రైతులకు అందాల్సిన సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సంఘ అభివృద్ధికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.

సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచే కీలక వేదికలని, రైతుల ప్రయోజనాలే కేంద్రంగా సొసైటీ కార్యకలాపాలు కొనసాగాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. నూతన పాలకవర్గం రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, వివిధ సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సీఈఓ రాజేశ్వర్, సంఘ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more