-- --

జాడి సొసైటీ చైర్మన్‌గా మల్లవరపు సుందర్ రాజు బాధ్యతల స్వీకరణ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తా..

బోధన్, అక్టోబర్ 30: సాలూర మండలంలోని జాడి జమాల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా నియమితులైన మల్లవరపు సుందర్ రాజు గురువారం సంఘ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సంఘ పరిధిలోని రైతులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన చైర్మన్ మల్లవరపు సుందర్ రాజుతో పాటు సంఘ పాలకవర్గ డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సంపూర్ణ సహకారం అందిస్తామని పలువురు పేర్కొన్నారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ మల్లవరపు సుందర్ రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రైతులకు సహకార సంఘం ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు రైతుల సంక్షేమం, అభ్యున్నతికి పాలకవర్గ సభ్యుల సమన్వయంతో కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి, అల్లె రమేష్, వివిధ సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సొసైటీ సీఈఓ శివరామకృష్ణ, సంఘ డైరెక్టర్లు ఎం. దేవదానయ్య, వెంకటేశ్వరరావు, ఏ. రామకృష్ణ, బి. ఆరోగ్య రాజు, వి. శ్రీనివాసరావు, డి. కొండయ్య, వై. సురేష్, వై. సైదమ్మ, వి. నరేష్, వి. లక్ష్మణ్, బి. అనితరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more