భక్తిశ్రద్ధలతో చండీయాగ హోమం
పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, అక్టోబర్ 19: నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని దుర్గా పరమేశ్వరి మాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం చండీయాగ హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేదమంత్రోచ్చారణలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, అదనపు కలెక్టర్లు భుజంగరావు, పి. సురేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీతో పాటు నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








