రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, అక్టోబర్ 18 (వి1 న్యూస్ తెలంగాణ): బోధన్ మండలం కల్దుర్కీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ పటేల్ నియమితులయ్యారు. ఆదివారం బోధన్లోని శ్రీ ఏకచక్రేశ్వర శివమందిరంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నిబంధనల మేరకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
నూతన చైర్మన్ ప్రకాష్ పటేల్ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పరిధిలోని రైతులు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”






