“దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు”.. పేకాట వెనుక అసలు కథేంటి?
లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయా? అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?
రాముడు మంచోడేనా… లేక ముసుగు వెనుక మరో కథ ఉందా?”
బోధన్, అక్టోబర్ 17 (వి1 న్యూస్ తెలంగాణ):
పోతంగల్ శివారులోని మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో రాములు పేరుతో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ప్రచారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.
రాముడు మంచి బాలుడు అంటూనే… అసలు కథ బయటపడితేనే కదా నిజం తెలిసేది!”
పేకాట స్థావరం వెనుక ఎవరున్నారు?
మంజీరా పరివాహక ప్రాంతంలో పేకాట కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? నిర్వాహకులకు ఎవరైనా అండగా నిలుస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడానికి కారణమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల నిఘా ఏమైంది?
చట్టవిరుద్ధమైన పేకాట కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. అలాంటప్పుడు పోతంగల్ శివారులో పేకాట జరుగుతోందనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? నిర్వహిస్తే ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? లేదా ఈ వ్యవహారంపై ఇంకా విచారణ జరగలేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
మంజీరా పేరును అప్రతిష్ఠపాలు చేస్తున్నారా?
మంజీరా నదీ పరివాహక ప్రాంతం పేకాట కార్యకలాపాలకు వేదికగా మారుతోందనే ప్రచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
“దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు” అనే సామెతను గుర్తు చేస్తూ.. ఈ వ్యవహారంలో అసలు నిజాలేమిటి? పేకాట స్థావరం ఉందనే ఆరోపణల్లో వాస్తవమెంత? అధికారుల నిఘా ఎక్కడ? ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతారా? అనేది ఇప్పుడు మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
గమనిక: ఇవి స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు మాత్రమే. సంబంధిత అధికారుల విచారణ, అధికారిక స్పందన ద్వారా వాస్తవాలు నిర్ధారణ కావాల్సి ఉంది.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... 022-22025222....8802007938






