### భక్తుల జయజయధ్వానాలు.. మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం…
**బోధన్, అక్టోబర్ 18:** శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోధన్ మండలం కల్దుర్కీలో దుర్గాదేవి అమ్మవారి పల్లకి సేవ శోభాయాత్ర ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకతో గ్రామంలో పండుగ శోభ నెలకొంది.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, భక్తులు భజనలతో శోభాయాత్రలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సొసైటీ అధ్యక్షుడు జిమ్మల గంగాధర్, ఉపాధ్యక్షుడు నఠన్ నాగనాథ్, సలహాదారు బంటు రమేష్, వీడీసీ సభ్యుడు బంటు గంగాధర్, గ్రామ పెద్దలు, అర్చకులు, మండప నిర్వాహకులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు..
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








