-- --

రైతులకు సేవలే లక్ష్యంగా ముందుకు.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జాడి సింగిల్ విండో పీఠంపై సుందర్ రాజు

రైతులకు సేవలే లక్ష్యంగా ముందుకు.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు

బోధన్, అక్టోబర్ 18 (వి1 న్యూస్ తెలంగాణ):

సాలూర మండలం జాడి జమాల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా మల్లవరపు సుందర్ రాజు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి సుందర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన చైర్మన్ సుందర్ రాజు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు అందేలా చూస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు వైట్ల శ్రీనివాసరావు, చిలక బాబు, నాయకులు బలరామ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more