పూల పండుగలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం
బోధన్, అక్టోబర్ 17 (వి1 న్యూస్ తెలంగాణ):
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామంలో శనివారం బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ, గౌరమ్మలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు, యువతులు వలయాకారంలో నృత్యాలు చేశారు. నూతన వస్త్రాలు ధరించిన మహిళలు, యువతులు, చిన్నారులు పండుగలో పాల్గొనడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ సమీపంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువతులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... 022-22025222....8802007938







