-- --

ఎరాజ్‌పల్లిలో మతసామరస్యానికి ప్రతీకగా దుర్గాదేవి పూజలో ముస్లిం సోదరులు!..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కులమతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకున్న మైనార్టీ సోదరులు – గంగా జమునా తహజీబ్‌కు నిలువుటద్దంగా గ్రామస్తుల ఐక్యత…

 

బోధన్, అక్టోబర్ 16: మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, మానవత్వమే అన్నింటికంటే గొప్పదని చాటిచెబుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్‌పల్లి గ్రామం మతసామరస్యానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు దర్శించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కులమత భేదాలకు అతీతంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ముస్లిం సోదరులు పాల్గొనడం గ్రామంలో సోదరభావానికి, పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. భిన్న మతాలకు చెందిన ప్రజలు ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ, పండుగలు మరియు సామాజిక కార్యక్రమాల్లో కలిసిమెలిసి పాల్గొనడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించారు.

తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానమున్న ‘గంగా జమునా తహజీబ్’ సంప్రదాయానికి ఎరాజ్‌పల్లి గ్రామస్తుల ఐక్యత అద్దం పడుతోంది. మతాలు వేరైనా మనసులు ఒక్కటేనని, సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని గ్రామస్తుల ఆచరణ చాటిచెబుతోంది.

నేటి సమాజంలో మతసామరస్యం, పరస్పర విశ్వాసం, సోదరభావం ఎంతో అవసరమైన నేపథ్యంలో ఎరాజ్‌పల్లిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఐక్యతకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే ప్రశాంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ గ్రామస్తుల ఐక్యత మరోసారి చాటి చెబుతోంది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more