-- --

సౌదీలో మృతి చెందిన కాశీరెడ్డి రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన సాటా ప్రతినిధులు **మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు భారత రాయబార కార్యాలయంతో సమన్వయం**

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

# సౌదీలో మృతి చెందిన కాశీరెడ్డి రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన సాటా ప్రతినిధులు

**మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు భారత రాయబార కార్యాలయంతో సమన్వయం**

**ఏకిన్‌పూర్, అక్టోబర్ 17 (వి1 న్యూస్ తెలంగాణ):**

జగిత్యాల జిల్లా, కోరుట్ల సమీపంలోని ఏకిన్‌పూర్ గ్రామానికి చెందిన కాశీరెడ్డి రాకేశ్‌ సౌదీ అరేబియాలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ప్రతినిధులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సాటా జనరల్ సెక్రటరీ ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, రాయికల్‌కు చెందిన సాటా ప్రతినిధి రాజేశం, కోరుట్ల స్థానిక ప్రతినిధి రజియుద్దీన్ పాల్గొన్నారు. వారు రాకేశ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని సౌదీ అరేబియా నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు చేపడుతున్న ప్రయత్నాలను వివరించారు.

రాకేశ్‌ కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో సాటా ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ వైస్‌ ఛైర్మన్ మాందా భీమ్ రెడ్డి సహకారంతో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయానికి అభ్యర్థన పంపించినట్లు తెలిపారు.

సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో మల్లేశ్ సహకారం అందిస్తున్నారని కుటుంబ సభ్యులకు వివరించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అధికారిక లాంఛనాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఒకరికొకరు అండగా నిలవాలని సాటా ప్రతినిధులు సూచించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సాటా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సాటా కోర్‌ టీమ్‌ తరఫున కాశీరెడ్డి రాకేశ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... 022-22025222....8802007938

Leave a Comment

Read more
Read more