రూ.500 కొట్టు.. ఇసుక పట్టు!
నలుగురు రిపోర్టర్ల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతోందా?
అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు ఇసుక ట్రాలీ ఆటోలను పట్టుకున్న అధికారులు….
బోధన్: రాజా చైన్ శివ ఆజ్ఞతోనే రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా సాగుతోందా? ఇసుక ట్రాలీ ఆటోల నుంచి రూ.500 వసూలు చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవమెంత? డబ్బులు ఇస్తేనే ఇసుక గమ్యస్థానానికి చేరుతోందా? లేదంటే అధికారులకు సమాచారం అందించి వాహనాలు పట్టుబడేలా చేస్తున్నారా?
బోధన్ ప్రాంతంలో ఇసుక రవాణాకు సంబంధించి నలుగురు రిపోర్టర్ల పాత్రపై స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరగాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

నలుగురు రిపోర్టర్ల పాత్ర ఏమిటి?
జర్నలిజం ముసుగులో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారా? డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారా? డబ్బులు ఇవ్వని వారిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి.

పోలీసుల చర్యలు.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా?
అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో భాగంగా బోధన్ రూరల్ పోలీసులు రెండు ఇసుక ట్రాలీ ఆటోలను పట్టుకున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అక్రమ రవాణా వెనుక ఉన్నవారిని గుర్తిస్తారా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్రపై నిజానిజాలను బయటపెడతారా? అన్నది వేచి చూడాలి.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన జర్నలిస్టుల వృత్తికి మచ్చ తెచ్చే చర్యలు ఎవరైనా చేపడితే, ఆధారాలతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








