-- --

సిరిసిల్ల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి – ఆర్డివో ఆఫీస్ లో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ వినతి

 

బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయాలి: గంధం రాజేష్

 

జర్నలిస్టులపై దాడులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలను నిరసిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆర్డివో ఆఫీస్ డిప్యూటీ సాయిలుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీజేఫ్ అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు, వేధింపుల ఆరోపణలు రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేలా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. సిరిసిల్ల ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవం, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం జర్నలిస్టులందరూ ఐక్యంగా నిలవాలని గంధం రాజేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన ప్రజావాణి సీఈఓ శ్రీనివాస్, దళిత జర్నలిస్ట్ ఫోరమ్ గౌరవ అధ్యక్షులు అశోక్ కాంబ్లే, మోహన్, రాహుల్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more