జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కలిసి అభినందనలు…
హుంసా: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం హుంసా గ్రామ మున్నూరు కాపు సంఘం సభ్యులు తొలిసారిగా ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సంఘం అభివృద్ధితో పాటు మున్నూరు కాపు సామాజికవర్గ సభ్యుల సంక్షేమం, ఐక్యతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పల్లె సురేష్, ఉపాధ్యక్షుడు కాచకాయల సాయినాథ్, వోలకొండ పిరాజి, పల్లె గంగారాం, నరేంద్ర, గంగారాం నగేష్, శివకుమార్ తదితర సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు..
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








