-- --

భీముని గుట్ట వద్ద భక్తిశ్రద్ధలతో గణేష్ పూజలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఘనంగా అన్నదానం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

బోధన్, సెప్టెంబర్ 20:
బోధన్ పట్టణంలోని రాకాసిపేట భీముని గుట్ట ఆలయం వద్ద శ్రీ సర్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం గణేష్ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి బోధన్ మున్సిపల్ చైర్మన్ తూమ్ పద్మశారత్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై గణేష్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, సర్వజనిక దేవుని గుట్ట గణేష్ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అన్నదాత తాళ సుమన్ గౌడ్, అధ్యక్షుడు గుంజేరి పోశెట్టి, తోకల గంగారెడ్డి, చిన్న శంకర్, తోకల చిన్న సాయిల్ అన్న, సంతోష్ గౌడ్, ప్రభాకర్, గుంజరి రాము, సాయిబాబా గౌడ్, కౌన్సిలర్ సావిత్రి, తోకల సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more