చార్టర్ ప్రెసిడెంట్ దేవ్ అమర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల విస్తరణకు ప్రణాళిక:
సమాజ సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. సామాజిక సేవ, ప్రజా సంక్షేమం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ చార్టర్ ప్రెసిడెంట్, రోజ్ చారిటబుల్ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ దేవ్ అమర్ సేవా కార్యక్రమాలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా కె. అజయ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలంబన చీఫ్ కోఆర్డినేటర్ వి. రమేష్ చంద్ర సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
క్లబ్ సభ్యులుగా విజయలక్ష్మి, వి. సతీష్, లక్ష్మీ ప్రసన్న కొనసాగుతున్నారు. కోర్ కమిటీ కోఆర్డినేటర్లుగా సూర్య, ఉదయ్, ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
అలాగే ఓంకార్ శ్రీనివాస్ రాజు అధ్యక్షుడిగా, అల్లె రమేష్ కార్యదర్శిగా, తుము రవీందర్ రెడ్డి ఖజానాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తులో సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలిచే విధంగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








