బోధన్ రూరల్: అడవి పందులను వేటాడేందుకు వ్యవసాయ పొలాల గట్ల వద్ద నాటు బాంబులు అమర్చిన ముగ్గురు వ్యక్తులను బోధన్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న పెంటకుర్దు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నాటు బాంబులు అమర్చినట్లు సాలంపాడ్ క్యాంపు గ్రామానికి చెందిన ఓ రైతు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది ఆచన్పల్లికి చెందిన **ద్యవనమైన మైసయ్య (26), మాసరొల్ల దత్తు (25), ఎరగాదిండ్ల గంగయ్య అలియాస్ గంగాధర్ (36)**లను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై క్రైం నంబర్ 190/2026 కింద BNS సెక్షన్ 110, Explosive Substances Act సెక్షన్ 5, Explosives Act సెక్షన్ 9-B కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలను నిపుణుల పరిశీలనకు పంపించి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసుల హెచ్చరిక: నాటు బాంబులు, పేలుడు పదార్థాలతో వేటాడటం రైతులు, కూలీలు, పశువులు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదకరం. ఇలాంటి పేలుడు పదార్థాలు కనిపిస్తే తాకకుండా, కదిలించకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. స్వయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయరాదని పోలీసులు సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







