ఓటర్ల జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్పర్సన్ పద్మ
బోధన్: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని, ఇందుకు అర్హులైన వారంతా ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పద్మ సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని 35, 36వ వార్డుల పరిధిలో గురువారం ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు.
షర్బత్ కెనాల్ ప్రాంతంలోని పాషాభాయ్ నివాసం వద్ద జరిగిన ఈ సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో పేర్ల పరిశీలన, తప్పుల సవరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, ఓటరు గుర్తింపు కార్డుల్లో పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో ఏవైనా తప్పులుంటే వెంటనే సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభా బేగం జావిద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ జహీర్, నాయకులు అర్షద్ పాషా, డబ్బు బాయ్, కో-ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్‌తో పాటు స్థానిక వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







