మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన 17వ నేషనల్ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్–2026లో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.
తెలంగాణ రాష్ట్రం తరఫున పోటీల్లో పాల్గొన్న రష్మి (47 కిలోలు), పీ. అరుష (22 కిలోలు), పీ. అవంతిక (31 కిలోలు) తమ తమ వెయిట్ కేటగిరీల్లో అద్భుత ప్రదర్శన చేసి గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
రష్మి నారాయణ స్కూల్‌కు చెందిన విద్యార్థిని కాగా, పీ. అరుష, పీ. అవంతికలు ఇందూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు. నాందేడ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బోధన్ విద్యార్థినులు మూడు బంగారు పతకాలు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రీడాకారిణులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించిన చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ ఎం.ఏ. సలాంకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







