-- --

స్వైన్‌ఫ్లూపై అప్రమత్తత

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఢిల్లీలో పెరుగుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. కొత్త వేరియంట్‌ లేదన్న ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ఫ్లూ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కొత్త వేరియంట్‌ కాదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల ప్రకారం ప్రస్తుతం దేశంలో వ్యాప్తిలో ఉన్న ఇన్‌ఫ్లుయెంజా ఏ (హెచ్‌1ఎన్‌1) వైరస్‌ గతంలోనే గుర్తించిన స్ట్రెయిన్‌కు చెందినదే. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌ కొత్తగా ఉద్భవించిన వేరియంట్‌ కాదని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ స్ట్రెయిన్‌లతోనూ ఇది అనుకూలంగా ఉందని తెలిపారు.

ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300కు పైగా ఇన్‌ఫ్లుయెంజా-ఏ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,777 హెచ్‌1ఎన్‌1 కేసులు ఉన్నట్లు తాజా ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క గురువారం రోజే 114 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సాధారణంగా కాలానుగుణ ఇన్‌ఫ్లుయెంజా స్వీయ పరిమిత స్వభావం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, నీరసం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇన్‌ఫ్లుయెంజా తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండటం, అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, అవసరమైతే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

— ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కానీ భయపడాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more