భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్న ప్రసాద వితరణ
బోధన్ టౌన్, ఆగస్టు 21 :
బోధన్ పట్టణంలోని మేదర్ గల్లీలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహేంద్ర మేదరి కుల సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చనతో పాటు వివిధ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అనంతరం అమ్మవారి సన్నిధిలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా మహేంద్ర మేదరి కుల సభ్యులు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మహేంద్ర మేదరి కుల సభ్యులు సీహెచ్. గంగాధర్, ఎస్. నగేష్, దండు పెద్ద సాయిలు, ఎం. ప్రకాష్, సీహెచ్. రమేష్, దండు చిన్న సాయిలు, కస్పా లింగం, గుడుమల సతీష్, సీహెచ్. శంకర్, కుమార్, ప్రశాంత్, ప్రవీణ్, లాలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







