-- --

సాలురా లో కబ్జాలపై అధికారుల మౌనం.. ‘కీళ్ల బొమ్మలా’ మారిపోయారా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బడాబాబుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా.. లేక కుమ్మక్కయ్యారా? ఒక్కరిపైనే చర్యలెందుకు? — జిల్లా ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

నిజామాబాద్ జిల్లా, సాలూర: ప్రభుత్వ భూములు, పంట కాలువలు, డ్రైనేజీ కాలువలు, గ్రామ పంచాయతీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు సాలూరులో తీవ్రంగా వినిపిస్తున్నాయి.

అధికారులు బడాబాబుల చేతిలో కీళ్ల బొమ్మల్లా మారిపోయారా? లేక వారితో కుమ్మక్కయ్యారా? అంటూ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారందరిపై సమానంగా చర్యలు తీసుకోకుండా

ఒక్కరిపైనే కఠినంగా వ్యవహరించడం ఎందుకు?

అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే ఒకే చట్టం, ఒకే తరహా చర్య ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే

సాలురా లోని అన్ని కబ్జాలపై సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలను గుర్తించి, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని

గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోకపోవడంపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే కబ్జా స్థలాల్లో విద్యుత్ మీటర్లు, సర్వీస్ కనెక్షన్లు ఏ ఆధారంగా ఇచ్చారు? నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనుమతులు ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా? అనే అంశాలపై

రెవెన్యూ, గ్రామ పంచాయతీ,“నీటిపారుదల శాఖ అధికారులు” విద్యుత్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

“అధికారులు నిజంగా నిబంధనల ప్రకారమే పనిచేస్తే.. కబ్జాదారు చిన్నవాడైనా, పెద్దవాడైనా చర్య ఒకటే ఉండాలి. అదే జరిగితేనే అధికారులపై ప్రజలకు నమ్మకం వస్తుంది” అని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిందే!

స్థానిక స్థాయిలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని వారు పేర్కొంటున్నారు.

కబ్జాలకు అడ్డుకట్ట వేయకపోతే రేపటి తరానికి మిగిలేది ప్రభుత్వ భూమి కాదు.. ఆక్రమణలే” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి

సాలురా లో సమగ్ర సర్వే నిర్వహించి, కబ్జాలపై సమానంగా చర్యలు తీసుకుంటారా? లేక ఇదే మౌనం కొనసాగుతుందా? అన్నదే ఇప్పుడు సాలూరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది….

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more