“భక్తి ఉన్న చోట భగవంతుని కృప తప్పదు.”
సాలూర, జూలై 17:
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. భజనలు చేస్తూ గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చి గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో గంగాజలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ సభ్యులు, భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







