భూకబ్జాలు, పంట కాలువల ఆక్రమణలపై నోటీసులు… అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు ఎక్కడ..?
సాలూరా, ప్రతినిధి:
సాలూరా మండలంలో భూకబ్జాలు, పంట కాలువల ఆక్రమణలు, ప్రజా ఆస్తుల పరిరక్షణ, అక్రమ మట్టి తవ్వకాల అంశాలు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో కొన్ని భూకబ్జాలు, పంట కాలువల ఆక్రమణలపై సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిపై తదుపరి చర్యలు ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు మండల వ్యాప్తంగా అక్రమ మట్టి తవ్వకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోజూ భారీ యంత్రాలతో మట్టి తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నా, తనిఖీలు, కేసులు, స్వాధీనాలు వంటి చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రజల అభిప్రాయం ప్రకారం, భూకబ్జాలు, కాలువల ఆక్రమణలపై నోటీసులు జారీ చేసిన అధికారులు, అక్రమ మట్టి తవ్వకాల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకే మండలంలో ఒక అంశంపై చురుకుదనం, మరో అంశంపై నిర్లక్ష్యం కనిపిస్తే అధికార వ్యవస్థపై ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారా..? లేక పై అధికారులకు పూర్తి సమాచారం చేరకుండా చేస్తున్నారా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ భూములు, పంట కాలువలు, సహజ వనరుల పరిరక్షణ విషయంలో చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిపై ఒత్తిళ్లు, విమర్శలు, బెదిరింపులు పెరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన వ్యవస్థే మౌనం వహిస్తే, ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, విజిలెన్స్ శాఖలు సాలూరా మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, భూకబ్జాలు, పంట కాలువల ఆక్రమణలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
“ప్రశ్నించే వారిపై కాదు… అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా అవసరం”
“అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తే… చర్యలే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచగలవు”
మండలంలో పెరుగుతున్న ఆరోపణల నేపప్రజా ఆస్తుల పరిరక్షణ, సహజ వనరుల దోపిడీ నివారణ, చట్ట అమలుపై ప్రజలకు భరోసా కల్పించేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.థ్యంలో ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు — “ఎమ్మెల్యే సాబ్ జరా దేఖో… ఇప్పటికైనా స్పందిస్తారా?”
ప్రజా ఆస్తుల పరిరక్షణ, సహజ వనరుల దోపిడీ నివారణ, చట్ట అమలుపై ప్రజలకు భరోసా కల్పించేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







