ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదిక
సాలూరలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహణ
సాలూర, జూన్ 8:
గ్రామాభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, గ్రామసభలు ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించి పరిష్కార మార్గాలు రూపొందించే కీలక వేదికలని సాలూర మండల తహశీల్దార్ నవాజ్ పేర్కొన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం సాలూర తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి గ్రామసభలు అత్యంత ఉపయోగకరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

గ్రామంలోని మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సభలో చర్చించారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని తహశీల్దార్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్, సర్పంచ్ లావణ్య, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
“ప్రజల మాటే అభివృద్ధికి బాట” అనే నినాదంతో నిర్వహించిన ఈ గ్రామసభలో గ్రామ సమస్యలపై ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించగా, వాటి పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







