May 30, 2026 3:12 am

V1News Telangana

రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణకు అధికారుల సహకారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ ఆర్డీఓ, తహసీల్దార్ సానుకూల స్పందన

బోధన్, మే 29: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణ కార్యక్రమానికి బోధన్ డివిజన్ అధికారులు సానుకూలంగా స్పందించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టి సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

సభ్యత్వ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బోధన్ ఆర్డీఓ శ్రీమతి విజయకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, సభ్యత్వ ప్రాధాన్యతపై వివరించారు. దీనికి స్పందించిన ఆర్డీఓ, తమ కార్యాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.

అనంతరం బోధన్ తహసీల్దార్ విట్టల్‌ను కలిసి సభ్యత్వ విస్తరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సభ్యత్వం పెరగడం ద్వారా సేవా కార్యక్రమాలు మరింత మందికి చేరువ అవుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రావు, బోధన్ మండల చైర్మన్ కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో క్యాప్షన్:
రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ కార్యక్రమంపై బోధన్ ఆర్డీఓ విజయకుమారి, తహసీల్దార్ విట్టల్‌లను కలిసి వినతిపత్రం అందజేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more