May 28, 2026 10:37 pm

V1News Telangana

నిజామాబాద్‌లో బీజేపీ జిల్లా స్థాయి దీనదయాళ్ ప్రశిక్షణ శిబిరాలు ప్రారంభం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక : ఎంపీ ధర్మపురి అర్వింద్..

నిజామాబాద్, మే 28 : రాష్ట్ర నాయకత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన పదాధికారుల నైపుణ్యాలను పెంపొందించేందుకు, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “పండిత్ దీనదయాళ్ ప్రశిక్షణ శిబిరాలు” గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిజామాబాద్‌లోని పద్మావతి గార్డెన్స్‌లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి, పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని పేర్కొన్న ఆయన, సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ శిక్షణా శిబిరాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , భరత్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ ఇంచార్జి వడ్డీ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, జిల్లా కార్యదర్శి మైస రాధా, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి కుర్లే శ్రీధర్, ఐటీ సెల్ ఇంచార్జి పిల్లి శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు సరిన్, ఇంద్రకరణ్, గోపికిషన్, గంగాధర్, సిర్ప సుదర్శన్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more