ఐకెపి VoA సమ్మెకు NPRD జిల్లా కమిటీ మద్దతు
బోధన్ రూరల్, మే 28 (గురువారం):
బోధన్ పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఐకెపి VoA ఉద్యోగుల సమ్మె గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) నిజామాబాద్ జిల్లా కమిటీ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపింది.
ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షుడు గైని రాములు, జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐకెపి VoA ఉద్యోగ ప్రతినిధులను పిలిచి చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో పని భారం తగ్గించడం, నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయడం, అర్హులైన వారిని సీసీలుగా నియమించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాద మరియు ఆరోగ్య బీమా రూ.20 లక్షల వరకు అందించడం, 58 జీవోను సవరించడం, అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్‌తో పాటు రమేష్, పోశెట్టి, నరేష్, లక్ష్మి, కృష్ణవేణి, గోదావరి, గంగాభవాని, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







