బోధన్, మే 28:
బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రజలు పరస్పర సహకారంతో బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, టౌన్ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







