మాక్లూర్, మదన్‌పల్లి, మే 28:
బక్రీద్ పండుగ సందర్భంగా మాక్లూర్ మండలంలోని మదన్‌పల్లి గ్రామంలో ఉన్న మదీనా మసీదు వద్ద శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో మత పెద్దలు, ముస్లిం సోదరులు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇమామ్‌లు, మత పెద్దలు బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. త్యాగం, సేవాభావం, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. అనంతరం దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక దువా నిర్వహించారు.

ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలో పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో సామరస్యపూర్వకంగా జరగడం ఆనందదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







