May 28, 2026 11:32 pm

V1News Telangana

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కమ్మ సంఘం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రక్తదాన, అన్నదాన సేవా కార్యక్రమాలతో జిల్లావ్యాప్తంగా నివాళులు..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్వర్గీయ (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు.

కమ్మ సంఘం అధ్యక్షుడు శివన్నారాయణతో పాటు సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి, సినీ మరియు రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలు అందించారని వక్తలు కొనియాడారు.

అదేవిధంగా వర్ని మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని చాటిచెప్పారు. కోటగిరి మండలం మరియు పరిసర గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జయంతి వేడుకలు విజయవంతం కావడంతో నిర్వాహకులను పలువురు అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more