నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని పసుపు వాగు ప్రాంతంలో ఈత చెట్లను కూల్చి కాల్చివేసిన ఘటనపై కల్లు గీత కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 594లో ఉన్న 8 ఎకరాల 6 గుంటల భూమి కల్లు గీత కార్మిక సంఘానికి చెందినదిగా నాయకులు తెలిపారు. ఆ భూమిలో ఈతవనాన్ని అభివృద్ధి చేస్తూ ఈత కళ్ల ద్వారా అనేక మంది గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈతవనంలోకి ప్రవేశించి సుమారు 50 నుంచి 60 ఈత చెట్లను కూల్చివేసి అనంతరం కాల్చివేశారని కార్మికులు ఆరోపించారు. ఈ ఘటనతో గీత కార్మికులకు భారీ నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గీత కార్మిక సంఘం నాయకులు బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కరరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పి. గంగాధర్ గౌడ్, బి. లింగా గౌడ్, కందుకాల శ్రీకాంత్ గౌడ్, వై. జీవన్ గౌడ్, వై. రమేష్ గౌడ్, ఎం. రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గీత కార్మికులు హాజరై సంఘీభావం తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







