Post Views: 41
బోధన్, మే 9: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13వ వార్డు చెక్కి క్యాంప్ ప్రాంతంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు భద్రతా అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అలాగే డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ఏరియా కౌన్సిలర్ లంక రవి పాల్గొని ప్రజలకు భద్రతపై అవగాహన అవసరమని తెలిపారు. ఎస్‌ఐ మనోజ్, ఏఎస్సై బాబురావు, బోధన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని ప్రజలకు పలు భద్రతా సూచనలు అందించారు.
పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని స్థానికులు అభినందించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








