కొత్తపల్లి పాలకవర్గం బాధ్యతల స్వీకారం
రైతులకు పారదర్శక సేవలందించడమే లక్ష్యం : ఇంచార్జ్ చైర్మన్ డా. సునీల్ కుమార్ చౌదరి
హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కోఆపరేటివ్ శాఖ సూచనల ప్రకారం పిఎసిఎస్ కొత్తపల్లి సొసైటీ నూతన పాలకవర్గం శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఇంచార్జ్ చైర్మన్‌గా డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి బాధ్యతలు చేపట్టారు.
డైరెక్టర్లుగా పులిచెర్ల లక్ష్మారెడ్డి, గుగులోతు తుకారాం, వల్లెపల్లి శ్రీనివాసరావు, దుబాస్ కృష్ణ, సురేష్ పటేల్, బాటి నిరంజన బాయి, సుభాష్ పటేల్ మరియు శంకర్ బాధ్యతలు స్వీకరించారు. పిఎసిఎస్ కొత్తపల్లి ఇంచార్జ్ సెక్రటరీ కమలేష్ మరియు ప్రభుత్వ పర్సన్-ఇన్-చార్జ్ ఎం. పుష్ప నుంచి నూతన పాలకవర్గం అధికారికంగా చార్జ్ తీసుకుంది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలకవర్గ సభ్యులు సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి రైతులకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు, రికార్డులు మరియు ఇతర సేవల నిర్వహణను పరిశీలించారు. రైతులకు అవసరమైన సేవలను త్వరితగతిన, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రైతుల పనుల్లో ఎలాంటి ఆలస్యం చోటుచేసుకోకుండా వెంటనే పూర్తి చేయాలని, సొసైటీ వ్యవహారాల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ పాలకవర్గం పర్యవేక్షణ కొనసాగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







