-- --

అంతర్ కళాశాలల కబడ్డీ టోర్నీలో తెలంగాణ యూనివర్సిటీ జట్టు ఛాంపియన్..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రన్నరప్‌గా కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల.. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్, ట్రోఫీల ప్రదానం…

నిజామాబాద్, నవంబర్ 17: తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌లో తెలంగాణ యూనివర్సిటీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. కామారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది.

మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ ప్లే గ్రౌండ్‌లో కబడ్డీ టోర్నమెంట్‌తో పాటు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు వర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. బి.ఆర్. నేత తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. బాలకిషన్ మాట్లాడుతూ.. క్రీడల్లో నిరంతరం సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ టోర్నమెంట్‌లో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 28 నుంచి 31 వరకు 2026లో బెంగళూరులోని ఏనోపోయా యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌లో తెలంగాణ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొంటారని వెల్లడించారు. అక్కడ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీకి మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ పోటీల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన మొత్తం తొమ్మిది కళాశాలల జట్లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో తెలంగాణ యూనివర్సిటీ జట్టు ఛాంపియన్‌గా, కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్, ట్రోఫీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు ప్రొఫెసర్ బాలమణి, అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. బి.ఆర్. నేత, జూనియర్ అసిస్టెంట్ జాదవ్ నరేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more