అమ్మవారి ఆలయ బలిపీఠం ధ్వంసం
బోధన్, అక్టోబర్ 30 (వీ1 న్యూస్ తెలంగాణ):
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలోని జగజ్జనని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న బలిపీఠాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలోని బలిపీఠాన్ని కూల్చివేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు.
ఈ ఘటనపై శుక్రవారం గ్రామస్తులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రాజశేఖర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని బలిపీఠాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు విచారణ చేపట్టి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలోని ఆలయాలు, పూజా స్థలాల పట్ల ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆలయాల వద్ద భద్రతపై దృష్టి సారించాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో బోధన్ మండల బీజేపీ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్‌తో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రాజశేఖర్‌కు ఫిర్యాదు అందజేస్తున్న అమ్దాపూర్ గ్రామస్తులు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







