చిన్నారుల సృజనాత్మకతకు వేదికగా ప్రదర్శన – అతిథుల ప్రశంసలు..
సాలూర: మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికితీయడానికి నిర్వహించిన రోబోటిక్స్ ఎక్స్‌పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు రూపొందించిన సాంకేతిక ప్రాజెక్టులు, వినూత్న నమూనాలు అక్కడికి వచ్చిన అతిథులు, తల్లిదండ్రులను ఆకర్షించాయి.
ఈ సందర్భంగా ఎక్స్‌పోను సందర్శించిన అతిథులు మాట్లాడుతూ, నర్సరీ స్థాయి నుంచే పిల్లలకు రోబోటిక్స్ మరియు కోడింగ్‌పై అవగాహన కల్పించడం అభినందనీయమని తెలిపారు. చిన్న వయసులోనే విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను ఆత్మవిశ్వాసంతో వివరిస్తుండటం వారి ప్రతిభకు, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడారు.
ప్రాథమిక దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని వారు అభిప్రాయపడ్డారు. పాఠశాల యాజమాన్యం వినూత్న కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ఆధునిక విద్యా విధానాల వైపు దారి తీస్తుండటం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







