జానకంపేట్‌లో ఆకస్మిక దాడులు.. ఆల్ఫ్రాజోలం కల్తీ నిర్ధారణతో కేసు నమోదు…
నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలం జానకంపేట్‌లో కల్లు సేవించిన కొందరికి నిర్వహించిన పరీక్షల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో జిల్లా స్పెషల్ ఫోర్స్ పోలీసులు కల్లు డిపోపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. సీఐ పూర్ణేశ్వర్ పర్యవేక్షణలో, ఎస్సై సందీప్ నేతృత్వంలో జరిగిన ఈ చర్యల్లో ఎడపల్లి ఎస్సై రామ కూడా పాల్గొన్నారు. మత్తు పదార్థాల కల్తీని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన ఈ చర్యలు అభినందనీయం. అక్రమ మత్తు పదార్థాల విక్రయాలు, కల్తీ కల్లు తయారీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రజారోగ్యం, యువత భవిష్యత్తు పరిరక్షణకు కృషి చేస్తున్న ఈగల్ టీమ్, జిల్లా స్పెషల్ ఫోర్స్ పోలీసుల సేవలు ప్రశంసనీయం.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








