-- --

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పాఠశాలల్లో హాజరు శాతం పెంపునకు సమష్టి కృషి చేయాలి…

– బోధన్ మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఆర్. భాస్కర్..

బోధన్, నవంబర్ 17:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని బోధన్ మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఆర్. భాస్కర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల పరిధిలోని అర్బన్, రూరల్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పరిస్థితి, విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆర్. భాస్కర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో విద్యార్థులందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలకు తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని, చదువు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు తిరిగి పాఠశాలలకు వచ్చేలా చొరవ తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థుల హాజరు పెంపు అనేది కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, ప్రతి విద్యార్థి విద్యాభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణ ఉండాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా UDISE Plus పోర్టల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని, ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా APAAR ID జనరేట్ చేయించాలని ఆదేశించారు. పాఠశాలల వారీగా విద్యార్థుల హాజరు, విద్యార్థుల సంఖ్య, ఇతర పాఠశాలలకు సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, CRPలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమ పరిధిలోని ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అందరూ సమష్టి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం అధికారుల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బోధన్ మండల విద్యాధికారి నాగయ్య, అందాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్, పెంటాకుర్దు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రత్నాకర్, మండలంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, CRPలు పాల్గొన్నారు.

– బోధన్ మండల విద్యాధికారి నాగయ్య ఒక ప్రకటనలో తెలిపారు….

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more