-- --

విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు మొబైల్ ప్లానిటోరియం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో ప్రత్యేక విజ్ఞాన కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా RDO విజయకుమారి, MRO విఠల్…

బోధన్: విద్యార్థులకు పుస్తకాల్లో చదివే అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభూతి ద్వారా పరిచయం చేస్తూ బోధన్‌లో మొబైల్ ప్లానిటోరియం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ RDO విజయకుమారి, MRO విఠల్ హాజరై కార్యక్రమాన్ని సందర్శించారు.

మొబైల్ ప్లానిటోరియం ద్వారా విద్యార్థులకు అంతరిక్షం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర మండలాలు, పాలపుంత తదితర ఖగోళ అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకతగా నిలిచింది. తద్వారా విద్యార్థులు శాస్త్రీయ అంశాలను ఆసక్తికరంగా తెలుసుకునే అవకాశం కలిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, అంతరిక్ష పరిశోధనలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తిని కలిగించడం ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను దృశ్యరూపంలో అనుభవించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జయశ్రీ, డైరెక్టర్ శశాంక్, మేనేజర్ శృతి, సీనియర్ మేనేజర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో విజ్ఞాన దాహాన్ని పెంచుతూ, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలనే స్ఫూర్తిని నింపేందుకు మొబైల్ ప్లానిటోరియం వంటి వినూత్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more