రైతుల సంక్షేమానికి కృషి చేస్తా.. సహకార సంఘం అభివృద్ధే లక్ష్యం..

బోధన్, నవంబర్ 5 (v1news): బోధన్ మండలం పెంటాఖుర్ధ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) చైర్మన్గా మద్దినేని శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా సొసైటీ పాలకవర్గం తరపున ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం సమష్టిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సొసైటీ పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావుకు పలువురు అభినందనలు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు అందించే సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ నాగేశ్వరరావు, చిట్టెపు కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నేత శివసాయి పటేల్, సొసైటీ సీఈవో రావూఫ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పెంటాఖుర్ధ్ సొసైటీ పగ్గాలు శ్రీనివాసరావుకు.. రైతుల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








