శాలువాతో ఘనంగా సన్మానించిన సాలూర మండల ప్రముఖులు….

సాలూర: జాడి జమాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) చైర్మన్గా నియమితులైన మల్లవరపు సుందర్ రాజును సాలూర మండలానికి చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మల్లవరపు సుందర్ రాజు రైతుల సంక్షేమానికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సహకార సంఘాలు రైతుల అభ్యున్నతికి కీలక పాత్ర పోషిస్తాయని, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చైర్మన్ కృషి చేయాలని పేర్కొన్నారు. సుందర్ రాజు నాయకత్వంలో సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాలూర మండలానికి చెందిన లక్ష్మణ్, కన్నె రమేష్, కన్నె లక్ష్మణ్, కోమటి దత్తు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







