-- --

సాలూర సొసైటీ చైర్‌పర్సన్‌గా అల్లె రమేష్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి…

సాలూర: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్‌పర్సన్‌గా అల్లె రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు సేవలందించే బాధ్యతను అప్పగించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్ అల్లె రమేష్ మాట్లాడుతూ, తనకు ఈ పదవి దక్కేందుకు సహకరించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు, రైతులతో సమన్వయం చేసుకుంటూ సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులకు అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అల్లె రమేష్ స్పష్టం చేశారు.అల్లె రమేష్ నియామకం పట్ల బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూతన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు….

 

 

.సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్‌పర్సన్ అల్లె రమేష్

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more