ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు
బోధన్: బోధన్ పట్టణంలోని 37వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో హెచ్‌ఎం కిషోర్‌తో పాటు ఉపాధ్యాయులు బస్వరాజ్, ఇందూర్ లలిత, చందర్కళ, గాయత్రి, సంతోషి, రాజు, నయీమ్, సావిత్రి, రాధిక, గోదావరి, నవిత, ముత్యం, రమ్య, రచన తదితరులు పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎస్ తట్టికోట, బోధన్ పాఠశాలకు చెందిన సనపటేల్ సర్ కార్యక్రమానికి హాజరై ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కూడా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడంతో పాఠశాల ఆవరణలో సందడి నెలకొంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







