డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు డ్రైవర్ల జేఏసీ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, యాప్ ఆధారిత డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
డ్రైవర్ల ప్రధాన డిమాండ్లలో ప్రతి ఏడాది రూ.12 వేల ఆర్థిక సహాయం అందించడం, ఆటో–ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా చెల్లుబాటయ్యే ఆటో పర్మిట్లు మంజూరు చేయడం, ఆటో–క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచడం ఉన్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆర్థిక సాయాన్ని బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని సంఘాల నేతలు కోరుతున్నారు.
అలాగే యాప్ ఆధారిత అక్రమ బైక్ ట్యాక్సీలపై చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక రవాణా యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీ, ఇతర సంస్థలకు ఈవీ ఆటోలను అందించే ప్రతిపాదనను నిలిపివేయాలని కూడా కోరుతోంది.

సమ్మె కారణంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని డ్రైవర్ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







