నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్ట్ బార్ అసోసియేషన్ వార్షిక ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి అడ్వకేట్ వాజిద్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు.
నాయకత్వం, నిష్ఠ, స్పష్టమైన దూరదృష్టితో బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని వాజిద్ హుస్సేన్ తెలిపారు. సభ్యుల సంక్షేమం కోసం మెడికల్ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు, బార్ రూమ్ మౌలిక వసతుల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
అలాగే జూనియర్ అడ్వకేట్లకు మార్గదర్శకత్వం అందించడం, బార్ వ్యవస్థను ఆధునికీకరించడం, లీగల్ టెక్నాలజీ మరియు డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా న్యాయవాదులకు మరింత సౌకర్యాలు కల్పిస్తానన్నారు.
వాజిద్ హుస్సేన్ అందరితో కలిసి మెలిసి ఉండే స్వభావం కలిగిన వ్యక్తి అని, తనదైన శైలితో అందరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆయన ప్రత్యేకత అని న్యాయవాదులు పేర్కొంటున్నారు. బార్ సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించి వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
బోధన్ కోర్ట్‌లోని న్యాయవాదులు తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని వాజిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఈ నెల 26 మార్చి 2026న జరగనుంది.
Author: IRFAN Reporter
Work from as a journalist







