April 12, 2026 1:51 am

V1News Telangana

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, ఏప్రిల్ 11:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., శనివారం ఆసుపత్రిని సందర్శించి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DM&HO)తో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గతంలో ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఆత్మహత్య సంఘటనలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ నిర్వహణలో కట్టుదిట్టమైన నియంత్రణ వంటి అంశాలపై సవివరంగా చర్చ జరిగింది.
అదేవిధంగా చిన్నపిల్లల అపహరణ ఘటనలు, ఆసుపత్రి ఆవరణలో అనాధుల మరణాలు, అనుమతి లేకుండా వాహనాలను పార్క్ చేసి వెళ్లే వ్యక్తులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇక ఆసుపత్రి బయట ఉన్న దుకాణాల వల్ల అంబులెన్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని సూపరింటెండెంట్ సీపీ దృష్టికి తీసుకురాగా, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
మొత్తంగా ఆసుపత్రి పరిధిలో భద్రత, సదుపాయాల మెరుగుదలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more