April 12, 2026 1:51 am

V1News Telangana

బోధన్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్కి క్యాంపు గ్రామంలో సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రధాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలేకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ అమాలి యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వీరన్న, హనుమంత్, పటేల్, శేఖర్, గాండ్ల సాయిలు, చంద్రకాంత్, సున్నప్ప, శంకర్, గుంటూరు ప్రసాద్, దత్తు, భూమయ్య, లక్ష్మణ్, పిట్ల వడ్డీయ తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలను స్మరించుకున్నారు.
వేడుకలు గ్రామంలో భక్తి, గౌరవ వాతావరణంలో నిర్వహించబడ్డాయి

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more