నిజామాబాద్, ఏప్రిల్ 10:
కందకుర్తిలో జరుగనున్న శ్రీ కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., స్వయంగా పరిశీలించారు.
ఏప్రిల్ 11న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావు భగవత్ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో, సభ స్థలం, విగ్రహ ప్రతిష్ఠాపన ప్రదేశం, బహిరంగ సభ ప్రాంతాలను కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రత పరంగా ఎలాంటి లోపాలు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సభ స్థలంలో కేంద్ర పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర స్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ టీమ్స్‌ను మోహరించినట్లు తెలిపారు. అదనంగా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం ప్రాంతాన్ని ఉంచుతున్నట్లు చెప్పారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు, రెంజల్ ఎస్సై శ్రీ చంద్రమోహన్, బోధన్ రూరల్ ఎస్సై శ్రీ మచ్చందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్సై రమ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అలాగే కేశవానంద భారతి ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ చామకూరి సుధాకర్ రెడ్డి, ప్రచారక్ శ్రీ శివకుమార్, సభ్యులు శ్రీ మల్లికార్జున్, శ్రీ సుబోర్ కాకాని తదితరులు హాజరయ్యారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








