April 12, 2026 1:49 am

V1News Telangana

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” : సర్పంచులకు పోలీస్ కమిషనర్ అవగాహన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అరైవ్ అలైవ్–2026”లో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై దృష్టి

నిజామాబాద్, ఏప్రిల్ 9:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్‌లో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లోని కామాక్షి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్–2026” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.
వ్యవసాయదారులు రహదారులపై ధాన్యం ఆరబెట్టే సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, వాహనాల మధ్య తగినంత దూరం ఉంచడం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలసటతో డ్రైవింగ్ చేయడం, క్రమశిక్షణ లోపం ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాల తగ్గింపుతో పాటు డ్రగ్స్ నియంత్రణలో కూడా సహకారం లభిస్తుందని కమిషనర్ తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతులైన వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం “అరైవ్ అలైవ్”కు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లహరి రఘు, వైస్ చైర్‌పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more