April 12, 2026 1:49 am

V1News Telangana

బోధన్‌లో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని అందాపూర్ గ్రామంలో సనాతన హిందూ బంధువుల ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో అందాపూర్‌తో పాటు ఉప్పల్ మండలం, ఎర్రాజుపల్లి, రాజీవ్ నగర్ తండా, సంగం, మినార్పల్లి, భవానిపేట్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా మల్లారం గ్రామానికి చెందిన శ్రీ బాలయోగ పిట్ల కృష్ణ మహారాజు హాజరై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. విశిష్ట అతిథిగా గుడిమెట్‌కు చెందిన శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ పాల్గొని భక్తి మార్గం ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, వార్డు సభ్యులు, సనాతన హిందూ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమం భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more